News August 23, 2024
హార్దిక్-నటాషా విడిపోవడానికి కారణమిదేనా?
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్‌నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.
Similar News
News January 26, 2025
విజయ్ చివరి మూవీ టైటిల్ ఇదే
తమిళ హీరో విజయ్ నటించనున్న చివరి మూవీకి ‘జన నాయగన్’ టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టర్ షేర్ చేశారు. బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి వినోద్ దర్శకుడు. TVK పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించిన ఇళయ దళపతి సందేశాత్మక చిత్రంతో సినీ కెరీర్ ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
News January 26, 2025
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
నీటి కింది నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. ఆ దేశ అధికారిక మీడియా KNCA ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రయోగాన్ని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగం విజయంతో తమ సైన్యం మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు మరింత బలంగా మారతామని, శత్రువులకు తగిన సమాధానమిస్తామని స్పష్టం చేసింది.
News January 26, 2025
12 రోజుల్లో రూ.260కోట్లకు పైగా కలెక్షన్స్
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక ప్రాంతీయ సినిమాకు ఇవే అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.