News November 28, 2024

ఈ రోజు స్టాక్ మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణం ఇదే?

image

US Inflation Data భార‌త స్టాక్ మార్కెట్ల‌పై ఒత్తిడి పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది. అమెరికాలో Consumer Spending బ‌లంగా ఉన్న‌ట్టు అక్టోబ‌ర్‌ ద్ర‌వ్యోల్బ‌ణం డేటా వెల్ల‌డించింది. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్ఠిగా ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే నెల ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత విధించ‌క‌పోవ‌చ్చ‌ని ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నారు. సెంటిమెంట్ బలహీనపడటంతో ఐటీ సహా కీలక రంగాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు తెలుస్తోంది.

Similar News

News December 27, 2024

నేడు APలో సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

image

AP: మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు ఏపీలో సెలవు ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారని, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రంలోనూ హాలిడే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన మన్మోహన్‌కు నివాళి ఇవ్వాలని పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 27, 2024

తినడానికి తిండిలేక మన్మోహన్ పస్తులు

image

ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.

News December 27, 2024

భారత్‌పై స్మిత్ రికార్డు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.