News October 11, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇదేనా?

image

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది. ఇందులో ప్రభాస్‌కు జంటగా ఇమాన్వి నటిస్తున్నారు. షూటింగ్ 60% కంప్లీట్ అయినట్లు సమాచారం. దేశభక్తి అంశాలతో ఈ మూవీ రూపొందుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News October 12, 2025

ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

image

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్‌లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.

News October 11, 2025

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

image

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.

News October 11, 2025

టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?

image

ఫోర్బ్స్ ఇండియా <<17957747>>జాబితాలో<<>> దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి(రూ.88,000 కోట్లు) 25వ స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ చీఫ్స్ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి 86వ, హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి 89వ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి 91వ స్థానంలో ఉన్నారు.