News March 12, 2025
మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కథ ఇదేనా?

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్‌లో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.
Similar News
News March 12, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
News March 12, 2025
MLAకు న్యూడ్ కాల్స్ చేసిన నేరగాళ్లు అరెస్ట్

TG: కాంగ్రెస్ MLA వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కిందట దుండగులు న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిరేకల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
News March 12, 2025
Stock Markets: బ్యాంకు షేర్లకు గిరాకీ

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,470 (-28), సెన్సెక్స్ 74,045 (-62) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. చమురు, ఎనర్జీ, PSE, PVT బ్యాంకు, కమోడిటీస్, ఫైనాన్స్, ఆటో, ఇన్ఫ్రా, మెటల్ షేర్లకు గిరాకీ పెరిగింది. ఐటీ, FMCG, హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇండస్ఇండ్, టాటా మోటార్స్, BPCL, కొటక్, HDFC బ్యాంకు టాప్ గెయినర్స్.