News March 2, 2025

సెమీస్‌లో భారత్ తలపడేది ఈ జట్టుతోనే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరిన జట్లు ఖరారయ్యాయి. గ్రూప్-Bలో 5 పాయింట్లతో దక్షిణాఫ్రికా తొలిస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇక రేపు న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-A టేబుల్ టాపర్ తేలనుంది. ఈ మ్యాచులో ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుండగా గెలిచిన జట్టు ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది.

Similar News

News November 28, 2025

‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

image

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.

News November 28, 2025

తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్‌షిప్

image

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్‌షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కోరారు. ఈ టౌన్‌షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.

News November 28, 2025

WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

image

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు