News January 31, 2025
విజయ్-గౌతమ్ సినిమా టైటిల్ ఇదేనా?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టైటిల్ లాక్ అయిందని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. త్వరలో దీనిని వెల్లడిస్తామని ఆయన పేర్కొనడంతో టైటిల్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News October 30, 2025
ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్. ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్‌లో డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్‌తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్ బటన్ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.
News October 30, 2025
12NHలపై EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.
News October 30, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


