News July 31, 2024

విధి రాత అంటే ఇదేనేమో..

image

కేరళలోని వయనాడ్ <<13744943>>విషాదానికి<<>> ముందు తీసుకున్న జాగ్రత్త ఓ కుటుంబాన్ని కాపాడితే మరో కుటుంబాన్ని కబళించింది. చూరాల్‌మలలో భారీ వర్షాలకు భయపడిన ఓ కుటుంబం ముండక్కైలోని బంధువుల ఇంటికొచ్చింది. నిన్న అక్కడ కొండచరియలు విరిగిపడి ఆ కుటుంబం బలైంది. ఇటు ముండక్కై గ్రామానికి చెందిన మహమ్మద్ అలీస్ కుటుంబం అక్కడి నుంచి మొప్పడికి వెళ్లి తలదాచుకుంది. వారు వెళ్లిన కొన్ని గంటలకే ముండక్కైలో విషాదం చోటు చేసుకుంది.

Similar News

News January 6, 2026

హెల్మెట్‌ లేదంటే.. చుక్క పెట్రోల్‌ పోయరు: నల్గొండ ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీస్‌ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్‌ – నో పెట్రోల్‌’ నిబంధన అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ వెల్లడించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయరాదని ఇప్పటికే అన్ని బంకు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

News January 6, 2026

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని పట్టించే హెల్మెట్!

image

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించే AI హెల్మెట్‌ను బెంగళూరుకు చెందిన ఓ టెకీ తయారు చేశారు. హెల్మెట్‌కు కెమెరాను అమర్చి దానికి AIని జోడించారు. రోడ్డుపై ఎవరైనా హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో వెళ్తే ఇది గుర్తించి ఫొటో తీస్తుంది. లొకేషన్, బండి నంబర్‌తో సహా ఆ ఫొటోలను పోలీసులకు పంపి ఛలాన్ వేసేలా చేస్తుంది. టెక్నాలజీ సాయంతో రోడ్డు భద్రతను పెంచే ఇలాంటి ఐడియాలు అవసరమని పోలీసులు అతడిని ప్రశంసించారు.

News January 6, 2026

ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?

image

మానవ శరీర వ్యవస్థ ఒక ఇంజినీరింగ్ అద్భుతం. మన కంటి మూలలో సూది మొనంత ఉండే ‘లాక్రిమల్ పంక్టం’ అనే రంధ్రం ఒక అదృశ్య డ్రైనేజీ పైపులా పనిచేస్తుంది. కళ్లలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. ఈ చిన్న రంధ్రం కంటి తేమను కాపాడుతూ చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు నుంచి కారేది ‘కన్నీళ్లే’. share it