News April 21, 2024
న్యాయ రాజధాని అంటే ఇదేనా?: షర్మిల
AP: కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్న YCP నేతలు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘కర్నూలు న్యాయ రాజధాని అంటే ఇదేనా? 5ఏళ్లలో సీమలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గండ్రేవుల ప్రాజెక్టు పూర్తైతే కర్నూలుకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ?’ అని కర్నూలు పర్యటనలో ఆమె ప్రశ్నించారు.
Similar News
News November 19, 2024
ఆస్ట్రేలియా వ్యూహాలేంటో కోహ్లీకి తెలుసు: మంజ్రేకర్
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పలు వ్యూహాలతో టార్గెట్ చేస్తుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఆ వ్యూహాలన్నీ విరాట్‌కు తెలుసని పేర్కొన్నారు. ‘ఆఫ్‌స్టంప్ ఆవల వెళ్లే బంతిని ఆడి ఔటవ్వడం కోహ్లీకి ప్రధాన బలహీనత. దాన్నే కంగారూలు లక్ష్యంగా చేసుకుంటారు. న్యూజిలాండ్ బౌలర్లు సక్సెస్ అయిన తరహాలోనే ఆయన శరీరంపైకి కూడా దాడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
News November 19, 2024
రేపు YS జగన్ ప్రెస్ మీట్
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని పార్టీ అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేసిన ఆయన, మరోసారి మీడియాతో మాట్లాడనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.
News November 19, 2024
ఏడిస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయంటే?
సాధారణంగా ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లు మానసిక స్థితికి సంబంధించినవి. ఆనందం, బాధ, నిరాశ, అసహనం ఇలా ఏది కలిగినా శరీరంలో హానికరమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని బయటకు పంపేందుకు ఏడుపు అవసరం. ఏడ్చేటప్పుడు ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా ఈ టాక్సిన్స్ కళ్ల చుట్టూ వెళ్తాయి. ఇవి శ్లేష్మం లేదా జిడ్డుగా గల ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే కన్నీటి రూపంలో బయటకు వస్తాయి.