News September 12, 2024

ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 7, 2025

NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

image

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.

News December 7, 2025

‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

image

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.

News December 7, 2025

డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

image

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం