News March 7, 2025
కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా?: YS షర్మిల

మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారిత ?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 09, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 9, 2026
పాలసీలు ఎల్లప్పుడూ ఆ రాష్ట్రాలకు అనుకూలంగా ఉండొద్దు: చంద్రబాబు

దేశంలో పనితీరు మెరుగ్గా లేని రాష్ట్రాలు కేంద్రం ఆదాయ వికేంద్రీకరణలో అధిక పన్ను వాటాను పొందుతున్నాయని ఏపీ CM చంద్రబాబు అన్నారు. ఇది మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఎవరికీ అన్యాయం చేయదన్నారు. వెనుకబాటుతనం, జనాభా వంటి అంశాలు ప్రామాణికమని తెలిపారు.
News February 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


