News December 17, 2024

ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం?: YCP

image

AP: రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో లీక్ కావడంపై ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ‘ఇదేనా చంద్రబాబు మీ 40 ఏళ్ల అనుభవం? అర్ధ సంవత్సర పరీక్షలే లీకేజీ లేకుండా నిర్వహించలేకపోయారు. రేప్పొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?’ అని ప్రశ్నించింది. అసమర్థుడైన లోకేశ్‌కు విద్యాశాఖ అప్పగిస్తే ఇలాంటి లీకేజీలే దర్శనమిస్తుంటాయ్’ అని ట్వీట్ చేసింది.

Similar News

News October 15, 2025

జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.

News October 15, 2025

ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 15, 2025

తాజా రౌండప్

image

* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు.. మొత్తంగా 32 నామినేషన్లు దాఖలు
* రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: రఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
* వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ 178 పాయింట్లు, సెన్సెక్స్ 575 పాయింట్లు అప్