News August 21, 2025

సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ ‘శుభం’ కార్డు?

image

నిర్మాతలు, సినీ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు క్లైమాక్స్‌కు చేరాయి. ఇవాళ మ.3 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చి సమ్మెకు శుభం కార్డు పలుకుతాయని తెలుస్తోంది. సినీ కార్మికులు షూటింగ్‌లు బంద్ చేయడంతో పలు సినిమాల విడుదలపై ప్రభావం పడింది.

Similar News

News August 21, 2025

కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలు: జగదీశ్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ పాలనలో రైతులకు <<17461451>>కష్టాలు<<>> మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రోడ్లెక్కి, అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకునే నేతలు, ప్రజలకు అదే అలవాటు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు, దళారులు కుమ్మక్కై రైతులకు ఈ దుస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

News August 21, 2025

కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి రూ.904 కోట్ల మంజూరు, రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాసేపట్లో మంత్రివర్గ భేటీ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.

News August 21, 2025

రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు: జియో

image

ప్రీపెయిడ్ ప్లాన్ రూ.799ను తొలగించారనే ప్రచారాన్ని జియో ఖండించింది. యూజర్లు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర పేమెంట్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్లను అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపింది. కాగా ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.