News April 5, 2025

లిప్‌స్టిక్ వాడితే ఇంత ప్రమాదమా?

image

చాలా మంది అందంగా కనిపించేందుకు తరచూ లిప్‌స్టిక్ వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లిప్‌స్టిక్ వల్ల టాక్సిన్స్ శరీరంలోకి వెళ్తాయి. ఇందులో ఉండే లెడ్ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. అలాగే కాడ్మియం బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాపర్ బ్రెయిన్, లివర్‌కు హాని చేస్తుంది. హెవీ మెటల్ ఫ్రీ లేబుల్ ఉన్న సర్టిఫైడ్ బ్రాండ్స్‌ను వాడండి. రీఅప్లై చేయడం మానండి’ అని చెబుతున్నారు.

Similar News

News January 13, 2026

‘MSVPG’కి ఫస్ట్ డే రూ.84 కోట్లు

image

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నిన్న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్+ఫస్ట్ డేకి కలిపి రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సెంటర్లలో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని పేర్కొంది. చిరంజీవి లుక్స్, మేనరిజం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అభిమానులను మెప్పిస్తున్నాయి.

News January 13, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>) 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై, 25ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. సైట్: https://csio.res.in/

News January 13, 2026

రూ.5,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,42,530కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,30,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,92,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుంటాయి.