News March 19, 2024
వంగవీటి రాధా ప్రచారానికే పరిమితమా? పోటీ చేస్తారా?
AP: ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన తరఫున వంగవీటి రాధా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుగుతారని సమాచారం. అయితే టీడీపీలో టికెట్ దక్కనందున జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఇవాళ ఎంపీ బాలశౌరితో సమావేశం కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
Similar News
News January 7, 2025
భారత్లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి
భారత్లో క్లౌడ్, ఏఐ మౌలికవసతుల విస్తరణకు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ‘భారత్లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా విస్తరించనున్నాం. మా అజూర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాం. ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంస్థను విస్తరిస్తున్నాం. 2030నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.
News January 7, 2025
ఘోర విపత్తు.. 95కి చేరిన మరణాలు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి టిబెట్లో 95 మంది మరణించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. మరో 130 మంది గాయపడినట్లు వెల్లడించాయి. గంట వ్యవధిలోనే భూమి ఆరు సార్లు కంపించినట్లు పేర్కొన్నాయి. దీంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపాయి.
News January 7, 2025
ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం: కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు కేసులో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు. మీ ఆరోపణలు నన్ను నాశనం చేయలేవు. మీ కుట్రలు నా నోరు మూయించలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది. నేను న్యాయానికి గౌరవిస్తాను. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం’ అని రాసుకొచ్చారు.