News November 4, 2024
వారెన్ బఫెట్ ‘రెడ్ సిగ్నల్’ ఇస్తున్నారా?

స్టాక్ మార్కెట్ లెజెండ్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే నగదు నిల్వలను మరింత పెంచుకుంది. చివరి త్రైమాసికంలో $276.9 బిలియన్లుగా ఉన్న క్యాష్ ఇప్పుడు $325.2 బిలియన్లకు పెరిగింది. ఆ కంపెనీ $300 బిలియన్లకు పైగా నగదు ఉంచుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో అమెరికా ఎన్నికల తర్వాత గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, అందుకే బఫెట్ షేర్లు అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Similar News
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.
News November 28, 2025
7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <
News November 28, 2025
గంభీర్‌పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.


