News October 29, 2024

ఈ లిస్ట్‌లో మీ మండలం ఉందా?

image

AP: ఖరీఫ్ సీజన్‌లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?

Similar News

News February 10, 2026

రేపు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ రేపు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రేపు 7AM నుంచి 5PM వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయి.

News February 10, 2026

స్థిరంగా బంగారం, వెండి ధరలు

image

కొన్నిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,57,910, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా ఉంది.

News February 10, 2026

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్‌ 5 డిప్యూటీ మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA(ఫైనాన్స్, ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), బీఫార్మసీ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. అసిస్టెంట్ మేనేజర్‌కు 37ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com