News October 21, 2025
మీ జుట్టు పొడిబారిందా? ఇలా చేయండి

థైరాయిడ్, PCOS, డయాబెటిస్ వల్ల చర్మం, జుట్టూ పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘సల్ఫేట్ ఫ్రీ ఫార్ములా ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంపిక చేసుకోవాలి. ప్రొడక్టుల్లో హైలురనిక్ యాసిడ్, స్క్వాలిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారణకు కీటోకొనజాల్, సెలీనియం సల్ఫైడ్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న లోషన్లను వాడాలి’ అని చెబుతున్నారు.
Similar News
News October 21, 2025
విపక్ష అభ్యర్థులకు NDA బెదిరింపులు: PK

ఓటమి భయంతో NDA కూటమి విపక్ష అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్‌డ్రా చేయిస్తోందని JSP అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఇలాగే వైదొలిగారని చెప్పారు. ‘NDA 400 సీట్లు పైగా గెలుస్తుందని గొప్పలు చెప్పుకొని 240 సీట్లకు పరిమితమైనా BJPకి ఇంకా గుణపాఠం కాలేదు. సూరత్ మోడల్‌ను అనుసరించాలనుకుంటోంది’ అని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, EC జోక్యం చేసుకోవాలని కోరారు.
News October 21, 2025
రికార్డుల మోత.. దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం

దేశవ్యాప్తంగా దీపావళి మోత మోగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 25 శాతం (రూ.4.25 లక్షల కోట్లు) సేల్స్ పెరిగినట్లు CAIT సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 87% మంది స్వదేశీ ఉత్పత్తులనే ఇష్టపడుతున్నారని, దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గిందని తెలిపారు.
News October 21, 2025
బాణసంచా కార్మికులకు బీమా ఉండాల్సిందే: CM

AP: కోనసీమ (D) రాయవరంలో బాణసంచా <<17957968>>పేలుడు<<>> ఘటనలో మృతులకు ₹15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని CBN ఆదేశించారు. ఒకే షెడ్డులో 14 మంది మాన్యుఫ్యాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడడంతో స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగిందని అధికారులు నివేదించారు. బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించకుంటే PD కేసులు పెట్టాలని CM ఆదేశించారు. కార్మికులకు వ్యక్తిగత బీమా ఉండాలన్నారు.