News April 6, 2025
జుట్టు రాలుతోందా.. ఇలా చేస్తే మేలు!

జుట్టు రాలడమనే సమస్యను నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. శిరోజాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణమని హెయిర్‌కేర్ నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లకు క్రమం తప్పకుండా నూనె(ఆముదం, కొబ్బరి, బాదం) పట్టించి మర్దనా చేయడం వల్ల వెంట్రుకలకు బలం అందుతుంది. ప్రొటీన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. 2 రోజులకోసారైనా తలస్నానం చేయాలని వారు పేర్కొంటున్నారు.
Similar News
News April 6, 2025
అగ్నివీర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు

అగ్నివీర్లకు పోలీసు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ తెలిపారు. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్నివీర్లకు రాష్ట్ర నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.
News April 6, 2025
సూర్య తిలకం.. PHOTO OF THE DAY

యూపీ అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ గర్భగుడిలో బాల రాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా బెంగళూరు IIA, CBRI సైంటిస్టులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News April 6, 2025
పశ్చిమ బెంగాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.