News May 12, 2024

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. మీ EPIC నంబర్ లేదా పేరు, అడ్రస్‌తో రాష్ట్రం ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే EPIC కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
☞☞ మే 13న జరిగే ఓట్ల పండుగలో మీరూ పాల్గొని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.

Similar News

News January 16, 2026

ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

image

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.

News January 16, 2026

రాష్ట్రంలో 424 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 18) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు రూ.4వేలు చెల్లిస్తారు. సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 16, 2026

తమిళ ఆడియన్సే అల్లు అర్జున్ టార్గెట్?

image

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌తో సినిమాలు ప్లాన్ చేశారు. ‘పుష్ప’తో ఇప్పటికే నార్త్‌లో ఆయనకు మంచి ఆదరణ ఏర్పడింది. సౌత్‌లో AP, TGతో పాటు కేరళ, కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది. ఇక మిగిలింది TN కావడంతో అక్కడి ఆడియన్స్‌నే బన్ని టార్గెట్ చేశారని టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాలు అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్టయితే బన్నీకి తిరుగులేనట్లే.