News December 31, 2024
ఈ లిస్టులో మీ పేరు ఉందా?

TG: త్వరలో జరగనున్న 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైటులో అందుబాటులో ఉంచింది. ఇందులో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC, వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ MLC స్థానాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3.41 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇక్కడ <
Similar News
News November 26, 2025
కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం ఎంతంటే?

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా.. బీబీపేట 13.4°C, జుక్కల్ 13.6, బొమ్మన్ దేవిపల్లి 13.7, గాంధారి, లచ్చపేట 13.9, నస్రుల్లాబాద్, రామారెడ్డి, రామలక్ష్మణపల్లి 14, లింగంపేట 14.4, డోంగ్లి, నాగిరెడ్డిపేట 14.6, ఇసాయిపేట, బిచ్కుంద, మేనూర్ 14.7, ఎల్పుగొండ 14.8, బీర్కూర్ 14.9, మాచాపూర్ 15°C ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News November 26, 2025
కుకుంబర్ మొజాయిక్ వైరస్‌తో మిరప పంటకు ముప్పు

కుకుంబర్ మొజాయిక్ వైరస్ సోకిన మిరప మొక్కలు గిడసబారి కనిపిస్తాయి. ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోవడంతో పాటు ఆకులు ఆకారం మారిపోయి, కొనలు సాగి కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన మొక్కల్లో పూత, కాపు ఉండదు. ఈ వైరస్ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3ml లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల్లో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి.
News November 26, 2025
అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

TG: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్(D) వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. HYD జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.


