News April 8, 2025
సమ్మర్‌లో మీ ఫోన్ వేడెక్కుతోందా?

సమ్మర్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు వేగంగా వేడెక్కుతుంటాయి. వాటిలో మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్‌పై వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. యాప్స్‌ను ఎక్కువగా వాడకుండా ఉండాలి. వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయాలి. వేడెక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్‌లో ఉంచకూడదు. కారులో ఫోన్ పెట్టి వదిలేయకండి
Similar News
News April 8, 2025
నేడు గుజరాత్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
News April 8, 2025
భారతీయులు గొప్ప ప్రతిభావంతులు: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇండియన్స్ గురించి మాట్లాడారు. ‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యల్ని సులభంగా పరిష్కరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ రంగంలోనూ ఇండియా శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్‌లోని పేదలు కూడా చాలా తెలివైన వారు కానీ అవకాశాల్లేక వెనుకబడుతున్నారు’ అని పేర్కొన్నారు.
News April 8, 2025
3600 దాటిన మయన్మార్ మృతుల సంఖ్య

మయన్మార్ భూకంప విలయంలో మృతుల సంఖ్య 3600 దాటింది. భవనాల శిథిలాల్ని తొలగించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి 5017మంది గాయాలతో ఉండగా 160మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.