News December 12, 2024

మీ వాట్సాప్ పనిచేస్తోందా?

image

నిన్న రాత్రి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. మెసేజ్‌లు వెళ్లడంలేదని యూజర్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే సాంకేతిక కారణాలతోనే సమస్య ఏర్పడిందని, త్వరలోనే పరిష్కరిస్తామని ‘మెటా’ ప్రకటించింది. మరి మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా పనిచేస్తున్నాయా?

Similar News

News December 1, 2025

KNR: ‘హెచ్‌ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

image

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

News December 1, 2025

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

image

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్‌లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్‌ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్‌తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.

News December 1, 2025

పురుషులు, స్త్రీలు ఎంత నీరు తాగాలంటే?

image

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. US అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్లు, స్త్రీలు 2.7లీటర్ల మేర నీరు సేవించాలంటున్నారు. వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతాయని, గర్భిణులు & పాలిచ్చే తల్లులు నీటిని ఎక్కువ సేవించాలని చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే ‘హైడ్రేషన్’, ఎక్కువ సేవిస్తే ‘హైపోనాట్రేమియా’ సమస్యలొస్తాయంటున్నారు.