News August 4, 2024

దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్న ఇషాన్ కిషన్?

image

టీమ్‌ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌ టోర్నీల్లో ఆడనున్నారట. ఝార్ఖండ్ తరఫున ఆడనున్న కిషన్, ఆ జట్టుకు కెప్టెన్సీ కూడా చేసే ఛాన్సుందని cricbuzz పేర్కొంది. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న నేషనల్ సెలక్టర్ల సూచనతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2023 ODI WC తర్వాత SA పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కిషన్, ఆ తర్వాత BCCI <<13558094>>కాంట్రాక్ట్<<>> కోల్పోయారు.

Similar News

News March 11, 2026

BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

image

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.

News March 11, 2026

BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

image

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.

News March 11, 2026

అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

image

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..