News November 24, 2024
SRHకు ఇషాన్ కిషన్.. రూ.11.25 కోట్లు

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు SRH దక్కించుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో కిషన్ వేలంలోకి రాగా ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఇతను ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచులు ఆడి 2644 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 135.87గా ఉంది. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటం ఇ’షాన్’ స్పెషాలిటీ.
Similar News
News December 8, 2025
జగిత్యాల: ‘గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ అశోక్ కుమార్, వచ్చిన ఆరుగురు అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేస్తూ, స్టేషన్లలో వినతులను మర్యాదగా స్వీకరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.
News December 8, 2025
YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.


