News July 5, 2024

వాటికి ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి: కేంద్రం

image

స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలపై ఐఎస్ఐ మార్కును కేంద్రం తప్పనిసరి చేసింది. వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో వినియోగదారులకు భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ISI మార్క్ లేని పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకం, నిల్వపై నిషేధం ఉన్నట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తెలిపింది. కాగా మార్చి 14న కేంద్రం ఆధ్వర్యంలోని DPIIT వంటపాత్రలపై నాణ్యత ప్రమాణ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.

News December 26, 2024

అజెర్‌బైజాన్ విమానాన్ని కూల్చేశారా?

image

అజెర్‌బైజాన్‌లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్‌బైజాన్‌లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.

News December 26, 2024

అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.