News March 20, 2024

ఐసిస్ ఇండియా హెడ్ అరెస్టు

image

ISIS ఉగ్రవాద సంస్థ టాప్ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ ఇండియా హెడ్ హారిస్ ఫారుఖీతో పాటు అతడి అనుచరుడు అనురాగ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటుతుండగా అస్సాంలోని దుబ్రీ వద్ద అరెస్టు చేశామని చెప్పారు. ISISలో కొత్త వారిని చేర్చడం, ఫండింగ్, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు ప్లాన్ చేసినట్లు వివరించారు.

Similar News

News September 9, 2025

నేటి నుంచి ఆసియా కప్ సమరం

image

యూఏఈ వేదికగా ఇవాళ్టి నుంచి ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) జరగనుంది. తొలి మ్యాచులో నేడు గ్రూప్-Bలోని అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్షం ప్రసారం చూడవచ్చు. రేపు గ్రూప్-Aలోని భారత్, యూఏఈ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి నిర్వహించే బాధ్యతలు ఇవే

image

భారత్‌లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవిని చేపట్టిన వారు రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ సభ సజావుగా, గౌరవప్రదంగా సాగేలా చూస్తారు. సభలో తటస్థంగా ఉంటారు. వీరు బిల్లులపై ఓటేసేందుకు వీలుండదు. ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణంతో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధులను చేపట్టవచ్చు.

News September 9, 2025

జగన్‌ను జైల్లో పెడతారా? లోకేశ్ సమాధానమిదే!

image

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్‌ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.