News May 9, 2024
పెళ్లి తర్వాత సహజీవనాన్ని ఇస్లాం ఒప్పుకోదు: హైకోర్టు
సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లి తర్వాత లివ్ఇన్ రిలేషన్‌ను ఇస్లాం అంగీకరించదు. అవివాహితులు, అడల్ట్స్ అయితే వారిష్టమొచ్చినట్లు జీవించవచ్చు’ అని పేర్కొంది. సహజీవనం చేస్తున్న తమకు పోలీస్ రక్షణ కావాలంటూ షాదాబ్- స్నేహా దేవి కోర్టును ఆశ్రయించారు. అయితే షాదాబ్‌కు వివాహమై, కూతురు కూడా ఉందని విచారణలో తేలింది. దీంతో కోర్టు ఆ యువతిని పేరెంట్స్ వద్దకు పంపాలని పోలీసులను ఆదేశించింది.
Similar News
News December 24, 2024
మణిపుర్‌కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ను అనూహ్యంగా తెరమీదకు తేవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాంతి భద్రతల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
News December 24, 2024
జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?
AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.
News December 24, 2024
కాకినాడ పోర్టులో అక్రమాల కేసు.. కె.వి.రావు పిటిషన్
AP: కాకినాడ పోర్టులో అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టు మాజీ యజమాని కె.వి.రావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అటు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అప్పటివరకు ఆయనపై చర్యలు వద్దని, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా సీ పోర్టును అక్రమంగా రాయించుకున్నారని విక్రాంత్‌పై ఆరోపణలొచ్చాయి.