News February 7, 2025

ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

image

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News February 7, 2025

నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనడం అబద్ధం: సోనూ సూద్

image

తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలు అబద్ధమని నటుడు సోనూ సూద్ ట్విటర్లో తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని పోస్ట్ పెట్టారు.

News February 7, 2025

ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?

image

అమెరికాకు వెళ్లిన స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్‌ పరిమితికి మించి పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఇబ్బందులపాలవుతున్నారు. ఇలా చేయడంతో విద్యార్థుల వీసాలు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటీసులను Xలో షేర్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ 15 రోజుల్లో 48గంటల కంటే తక్కువ సేపు మాత్రమే పనిచేయాలి.

News February 7, 2025

కలియుగ శ్రవణ కుమారులు!

image

తల్లిదండ్రులను కావడిపై మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు ఎందరికో ఆదర్శం. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు మహాకుంభమేళాలో కనిపించారు. తమ తల్లిదండ్రులను చెరో వైపు కూర్చోబెట్టుకుని శ్రవణ కుమారుడి తరహాలో కావడిపై మోశారు. వయసైపోయిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో ఉంచుతున్న ఈ రోజుల్లో ఇలా వారికి సేవ చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరేమంటారు?

error: Content is protected !!