News November 25, 2024
సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన ఇజ్రాయెల్!
లెబనాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడనుంది. ఈ ఒప్పందం మేరకు హెజ్బొల్లా తన బలగాలను లిటాని నదికి ఉత్తరంగా తరలించాలి. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ ఒప్పందం అమలును అమెరికా పర్యవేక్షిస్తుంది.
Similar News
News November 25, 2024
Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ
ఆదాయ పన్ను చెల్లించే మహిళలు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ నుంచి 6.53 లక్షల మంది మహిళలు పన్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 లక్షల మంది పన్ను చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఐదేళ్ల గణాంకాలు తీసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మహిళలు తెలంగాణలో అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
News November 25, 2024
ఇది కదా విజయం అంటే..!
లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా చరిత్రలోకెక్కారు.
News November 25, 2024
షాకింగ్: సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్దీ రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను IPL వేలంలో దురదృష్టం వెంటాడింది. స్టార్ హిట్టర్‌గా పేరొంది, ప్రస్తుతం BGTలో భారత జట్టుకూ ఎంపికైన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. గతంలో అతడు RCB, పంజాబ్, DC తరఫున ఆడారు. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను పంజాబ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.