News April 24, 2024
ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా

ఇరాన్, పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తమకు అప్పగించిన పనిని ఆరోజు సమర్థవంతంగా చేయలేకపోయామని, యుద్ధం వల్ల కలిగిన బాధ తనను నిరంతరం వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 7 తన దృష్టిలో బ్లాక్ డే అని చెప్పారు.
Similar News
News January 15, 2026
BISAG-Nలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N)లో 5 గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంసీఏ, డిప్లొమా(గ్రాఫిక్స్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/
News January 15, 2026
ముగిసిన ఖర్మాస్.. ఇక శుభకార్యాల జోరు!

గత నెల రోజులుగా కొనసాగిన ఖర్మాస్ (అశుభ కాలం) నిన్నటితో ముగిసింది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. దీంతో ఇకపై వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, ఆస్తి కొనుగోళ్లకు తలుపులు తెరుచుకున్నాయి. దేవతల కాలం మొదలైనందున ఈ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్ర మౌఢ్యమి FEB 17 వరకు ఉంది.
News January 15, 2026
హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు

1. మురళి దివి & ఫ్యామిలీ: రూ.91,100 కోట్లు (దివిస్ ల్యాబరేటరీ) 2. P. పిచ్చిరెడ్డి: రూ.42,650 కోట్లు (MEIL) 3. P.V. కృష్ణారెడ్డి: రూ.41,810 కోట్లు (MEIL) 4. పార్థసారథి రెడ్డి: రూ.39,030 కోట్లు (హెటిరో ఫార్మా) 5. డా.రెడ్డీస్ ఫ్యామిలీ: రూ.39,000 కోట్లు 6. PV రామ్ ప్రసాద్ రెడ్డి: రూ.35,000 కోట్లు (అరబిందో ఫార్మా) 7.సురేందర్ సాలుజా 8.జూపల్లి రామేశ్వర్ రావు
>ఫోర్బ్స్ & హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం


