News September 10, 2025
2 నెలల్లో 6 దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధం

ఇజ్రాయెల్ గత 2-3 నెలల్లోనే 6 దేశాలతో యుద్ధం చేసింది. గాజా, ఇరాన్, యెమెన్, సిరియా, లెబనాన్, ఖతర్ దేశాలతో తలపడింది. హమాస్ టెర్రరిస్టుల లక్ష్యంగానే ఈ దేశాలన్నింటితో వైరం పెట్టుకుంది. దాదాపు అన్ని దేశాలపై పైచేయి సాధించింది. అమెరికా సాయంతో IDF మిస్సైల్స్, క్లస్టర్ బాంబులు, డ్రోన్లు వాడి దాడులు చేసింది. హమాస్‌ను నిర్మూలించేందుకు ఎవరితోనైనా యుద్ధం చేస్తామని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News March 29, 2026
మరో 2 రోజులే గడువు!

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.
News March 29, 2026
OTTలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 19న థియేటర్లలో విడుదలైంది.
News March 29, 2026
ఫ్రిజ్‌లో వీటిని పెడుతున్నారా?

తాజాగా ఉంటాయని అనవసరమైన వస్తువులనూ కొందరు ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ కొన్నింటికి గది ఉష్ణోగ్రత సరిపోతుందని హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. పొటాటో, యాపిల్స్, క్యారెట్స్, టమాటా, మామిడి, అరటి పండ్లు, పుచ్చకాయలు, ఉల్లి, బ్రెడ్, వెల్లుల్లి, గుమ్మడి, తేనె, పిండి, ఊరగాయలు, గుడ్లు, దోసకాయలను ఫ్రిజ్‌లో పెట్టొద్దని సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెడితే అరటి, పుచ్చ వంటివి త్వరగా పాడవుతాయని అంటున్నారు.


