News September 22, 2024

హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

image

మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన క్షిపణి దాడుల్లో 38 మంది మృతి చెందారు. ఇందులో హెజ్బొల్లా నెం.2 ఇబ్రహీం అకీల్ ఉన్నారు. మొత్తంగా సంస్థకు చెందిన 16 మంది కీలక కమాండర్లను హతమార్చింది. సంస్థ చీఫ్ నస్రల్లాతో పాటు మరో ఇద్దరు కీలక కమాండర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. తమ పౌరులకు హాని కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.

Similar News

News September 22, 2024

OTTల్లో పొగాకు హెచ్చరికలు తప్పనిసరి!

image

పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.

News September 22, 2024

ముంపు నష్టం నమోదుకు నేడు, రేపు అవకాశం

image

AP: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశామని, కొత్తగా రూ.9.62 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేడు, రేపు సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని తెలిపారు. సోమవారం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

News September 22, 2024

అల్ప పీడనం.. భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు పలకరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో APలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.