News October 5, 2025
బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది: ట్రంప్

గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు US అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘బలగాల ఉపసంహరణపై పంపిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపితే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత మొదలవుతుంది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణకు నిబంధనలు సిద్ధం చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన చేయలేదు.
Similar News
News October 5, 2025
దగ్గు మందు తాగి చిన్నారుల మృతి.. డాక్టర్ అరెస్ట్

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మందు వాడాలని సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సిరప్ తయారు చేసిన TNలోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు వాడిన దగ్గుమందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని, అది విషపూరితమని అధికారులు వెల్లడించారు.
News October 5, 2025
డీమార్ట్ ఆదాయం పెరుగుదల

డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆ సంస్థ ఆదాయం రూ.16,219 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.14,050కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య 432కు చేరింది. ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో డీమార్ట్ బిజినెస్ నిర్వహిస్తోంది.
News October 5, 2025
ఇవాళ చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

HYDలో చికెన్ ధర స్కిన్ లెస్ రూ.230-రూ.240గా ఉంది. కామారెడ్డిలో రూ.240కు విక్రయిస్తున్నారు. విశాఖలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270, స్కిన్‌తో రూ.260, మటన్ కిలో రూ.1000గా ఉంది. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.210-రూ.220, కృష్ణా జిల్లాలో రూ.200-రూ.210, పల్నాడు జిల్లాలో రూ.220-రూ.230గా అమ్మకాలు జరుగుతున్నాయి. నూజివీడులో మటన్ కిలో రూ.750, చికెన్ కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు.