News September 27, 2024

లెబనాన్‌పై భీకర దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్!

image

లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఉత్తర సరిహద్దులో భారీగా సాయుధ వాహనాలను మోహరించింది. హెజ్బొల్లా దాడులు కొన‌సాగితే లెబ‌నాన్‌ కూడా గాజా ప‌రిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఇజ్రాయెల్ హెచ్చ‌రించింది. ‘హెజ్బొల్లాపై గగనతలం, సముద్రం నుంచి దాడి చేశాం. ఇప్పుడు భూదాడికి సిద్ధం కండి’ అని సైన్యానికి రక్షణ మంత్రి యోవ్ పిలుపునిచ్చారు.

Similar News

News September 28, 2024

దయచేసి విపరీతార్థాలు తీయకండి: రామజోగయ్య శాస్త్రి

image

ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే రిజల్ట్ ‘దేవర’లా ఉంటుందని తాను అన్న మాటకు విపరీతార్థాలు తీయొద్దని రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఓరి నాయనో. ఇది ఎటో దారితీస్తున్నట్లుంది. నా ఉద్దేశం శివ తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారనే తప్ప మరొకటి కాదు. విపరీతార్థాలు తీయవద్దని మనవి’ అని ట్వీట్ చేశారు. ఎవరి పని వాళ్లను చేసుకోనివ్వాలంటూ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో అన్న సంగతి తెలిసిందే.

News September 28, 2024

ఎన్టీఆర్ ‘దేవర’ వచ్చేది ఈ ఓటీటీలోకే?

image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌(OTT)లో రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

News September 28, 2024

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణపై ఈ నెల 30వ తేదీ నుంచి సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. HYD మాసబ్‌ట్యాంక్ కార్యాలయంలో అభిప్రాయాలు తెలియజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. commr.scsubclassification@gmail.comకు కూడా అభిప్రాయాలు పంపవచ్చని సూచించింది.