News July 2, 2024
ఆ ప్రాంతం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకుం

గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌లోకి మళ్లీ ఇజ్రాయెల్ దళాలు అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇక్కడ నక్కారనే సమాచారంతో దాడులకు రెడీ అవుతున్నట్లు సమాచారం. నగరంలోని తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఖాన్ యూనిస్‌లో హమాస్ ఉగ్రవాదుల కోసం ఇజ్రాయెల్ జల్లెడ పట్టింది. దాడులతో ఈ నగరం నామరూపాల్లేకుండా పోయింది.
Similar News
News January 6, 2026
బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్‌కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
News January 6, 2026
చలిగా ఉందని వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం హాయిగా అనిపించినా లేనిపోని సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగలు కక్కే నీటితో స్నానం చేస్తే ‘చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఆపై చర్మం పొడిగా మారి దురద, పగుళ్లు ఏర్పడతాయి. తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి, బలహీనమై రాలిపోతుంది. శరీర ఉష్ణోగ్రతతో పాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి’ అని సూచిస్తున్నారు.
News January 6, 2026
రెండు సార్లు ఫెయిలై మూడోసారి సక్సెస్

హైడ్రోఫోనిక్ విధానంలో తొలుత ఆశించిన విధంగా కూరగాయల దిగుబడి రాలేదు. 2సార్లు ఫెయిలై మూడోసారి సక్సెస్ అయ్యారు. ఇంట్లో వాడుకోగా మిగిలినవి అమ్మాలనుకున్నారు. మార్కెట్‌లో బ్రకోలీ, క్యాబేజీ, ఇతర ఆకుకూరలకు డిమాండ్ ఉందని గ్రహించి.. తన ఇంట్లోనే దాదాపు అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేస్తూ.. ‘బ్లూమ్ ఇన్ హైడ్రో’ పేరుతో స్థానిక రెస్టారెంట్లు, హోటల్స్, కెఫేలకు అందిస్తూ మంచి లాభాలు సాధించారు.


