News March 22, 2025
హమాస్ సైనిక నిఘా చీఫ్‌ను అంతం చేశాం: ఇజ్రాయెల్

హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్‌గా ఉన్న ఒసామా టబాష్ను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు పేర్కొంది. హమాస్ ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో నిర్దేశించే టార్గెటింగ్ యూనిట్‌కీ ఒసామా నేతృత్వం వహిస్తున్నాడని తెలిపింది. దీనిపై హమాస్ నుంచి స్పందనేమీ రాలేదు.
Similar News
News February 9, 2026
ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 9, 2026
APPLY NOW: NIT రాయ్‌పుర్‌లో ఉద్యోగాలు

<
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.


