News October 2, 2024
దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్రకటించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్రకటనలు జారీ చేసింది.
Similar News
News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.
News January 23, 2026
తిరుమల అప్‌డేట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.


