News July 13, 2024

ఇజ్రాయెల్: మూడేళ్లు సైన్యంలో పని చేయాల్సిందే!

image

హమాస్‌తో యుద్ధం కొనసాగుతుండగా ఇజ్రాయెల్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రతి పురుషుడు తప్పనిసరిగా మూడేళ్లు మిలిటరీలో పనిచేసేలా నిబంధనను తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం 34 నెలలు పనిచేయాలనే నిబంధన ఉంది. హమాస్, హెజ్‌బొల్లాతో ఏకకాలంలో యుద్ధం చేయాల్సి రావడంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందట. కొత్త నిబంధనకు రేపు జరిగే పూర్తిస్థాయి కేబినెట్ భేటీలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

Similar News

News December 5, 2025

రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్‌కు ఆహ్వానం

image

రాష్ట్రపతి భవన్‌లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్‌లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.

News December 5, 2025

ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

image

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

News December 5, 2025

CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీల‌కం కానుందని INC పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీల‌క‌ ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌మయ్యే వారికి స‌మ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.