News February 12, 2025
ఇజ్రాయెల్ vs హమాస్.. మళ్లీ యుద్ధం తప్పదా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324030252_367-normal-WIFI.webp)
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శనివారం మధ్యాహ్నం లోపు తమ దేశ బందీలను విడిచిపెట్టకపోతే గాజాపై సైనిక చర్యకు దిగుతామని, సీజ్‌ఫైర్ డీల్ ముగుస్తుందని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ అంతు చూసే వరకు నిద్రపోమని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇదే మాట చెప్పారు. అయితే ట్రంప్ ఒప్పందాలను గౌరవించాలని, ఆయన హెచ్చరికలను తాము పట్టించుకోమని హమాస్ తేల్చి చెప్పింది.
Similar News
News February 12, 2025
బుమ్రా లేకుండా భారత్ కప్పు కొడుతుందా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330521778_367-normal-WIFI.webp)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరం కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమని, అతడు లేకుంటే బౌలింగ్ దళం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, 2023 WTC ఫైనల్‌కు బుమ్రా దూరమయ్యారని.. ఫలితంగా భారత్ ఆ కప్పులను కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. మరి ఈసారి బుమ్రా లేకుండా భారత్ ఈ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా? కామెంట్ చేయండి.
News February 12, 2025
మార్చిలో మెగా DSC నోటిఫికేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739313507008_893-normal-WIFI.webp)
AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.
News February 12, 2025
హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732979073076_654-normal-WIFI.webp)
TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.