News July 22, 2024
ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ అథ్లెట్లను స్వాగతించం: ఫ్రాన్స్ ఎంపీ

పారిస్లో జరిగే ఒలింపిక్స్-2024 క్రీడలకు వచ్చే ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించారు. ‘గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై ఒలింపిక్స్లో నిషేధం విధించేలా ప్రజా ప్రతినిధులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తీసుకురావాలి. రష్యా తరహాలోనే ఇజ్రాయెల్నూ చూడాలి’ అని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని ఫ్రాన్స్ యూదుల గ్రూప్ ఖండించింది.
Similar News
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.
News December 8, 2025
కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.. అల్లూరిలో 5.3 డిగ్రీలు నమోదు

ఏపీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపట్టులో 7.7, డుంబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లి 9.5, హుకుంపేటలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అటు తెలంగాణ HYDలోని HCUలో 9 డిగ్రీలు, BHELలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొన్నారు.
News December 8, 2025
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<


