News October 3, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్‌కు హమాస్ ఇంకా అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్నటి నుంచి పలుచోట్ల చేపట్టిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు మరణించారు. సౌత్ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 30 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అటు గాజాకు మానవతాసాయాన్ని అందించేందుకు వచ్చిన 40కి పైగా షిప్పులను ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకున్నాయి.
Similar News
News October 3, 2025
‘రాణీ కనకవతి’గా కట్టిపడేసిన రుక్మిణీ

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ నిన్న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రాణీ కనకవతిగా రుక్మిణీ వసంత్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఆమె పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్, అందం, అభినయానికి ఫిదా అవుతున్నారు. కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌కు రుక్మిణీ న్యాయం చేశారు. SMలో ఆమె పేరు మారుమోగిపోతోంది. మూవీ చూసినవారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
News October 3, 2025
INDvsWI టెస్టు.. రెండో రోజు ఆట మొదలు

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్, టీమ్‌ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి రోజు తొలి ఇన్నింగ్సులో WI 162 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 2 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో రాహుల్(62*), గిల్(20*) ఉన్నారు. ఇవాళ భారత బ్యాటర్లు నిలదొక్కుకుంటే వెస్టిండీస్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది.
News October 3, 2025
ఈ నెల 9న జగన్ ఉత్తరాంధ్ర పర్యటన?

AP: YCP చీఫ్ జగన్ ఈ నెల 9న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పర్యటన విజయవంతం చేసేందుకు ఈ నెల 5న ఉత్తరాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాల్లో YCP రెండింటిలోనే గెలిచింది. ఈ క్రమంలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయంపై జగన్ దిశానిర్దేశం చేస్తారని టాక్.