News July 29, 2024

హెజ్బొల్లాపై ప్రతీకారానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం

image

తమ దేశంపై రాకెట్ దాడికి పాల్పడిన హెజ్బొల్లాపై ప్రతి దాడి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఈమేరకు PM నెతన్యాహుకు అధికారాన్నిస్తూ ఆ దేశ భద్రతా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 12మంది చిన్నారులు మరణించారు. అయితే తాము దాడి చేయలేదని హెజ్బొల్లా చెబుతుండటం గమనార్హం. రెండు దేశాల మధ్య ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి తెర తీయొచ్చని ప్రపంచ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 6, 2026

కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటే: పవన్ కళ్యాణ్

image

AP: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని, హిందూ దేవుళ్లను అవమానిస్తే మౌనం వీడాలని డిప్యూటీ CM పవన్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటేనన్నారు. ‘ఎవరి కర్మకు వారిని వదిలేసే పద్ధతి మారాలి. మన ధర్మాన్ని అవమానిస్తే పోరాడాల్సింది మనమే. భక్తులుగానే కాదు.. ధర్మ రక్షకులుగా మారాలి. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. మన విశ్వాసాలను కాపాడుకోవడమే’ అని SMలో పేర్కొన్నారు.

News February 6, 2026

చౌడు నేలల్లో పంటలకు యూరియా ఇలా వేస్తే మేలు

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

News February 6, 2026

అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.