News April 1, 2024

ఇజ్రాయెల్ ప్రధానికి సర్జరీ

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హెర్నియా సర్జరీ జరిగింది. ఆదివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని పీఎం కార్యాలయం ప్రకటించింది. ఇటీవల చేసిన చెకప్‌లో వైద్యులు హెర్నియాను గుర్తించారని, వారి సూచనల మేరకు పీఎం సర్జరీ చేయించుకున్నారని స్పష్టం చేసింది. కాగా.. గాజాపై యుద్ధం విషయంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ వేలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

Similar News

News January 26, 2026

జెండా ఆవిష్కరణ.. ఈ తేడాలు తెలుసా?

image

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT

News January 26, 2026

బన్నీతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

image

LCUని పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమవడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్‌ & బన్నీతో చాలాకాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. ఇది పూర్తయ్యాక ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్ సినిమాలుంటాయి. రెమ్యునరేషన్ కారణంగా ఖైదీ-2 నుంచి వైదొలిగాననేది అవాస్తవం’ అని లోకేశ్ వెల్లడించారు.

News January 26, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

image

బారక్‌పోర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>) 62 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్‌లు JAN 28న, డిగ్రీ (BCom,BSc/BCA)ఉత్తీర్ణులు JAN 29న, బీఈ/బీటెక్ అర్హతగల వారు JAN 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://hal-india.co.in