News October 7, 2024
లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది మృతి

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 10 మంది మృతి చెందారు. బారాషీట్‌లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి సమయంలో స్థానికంగా రెస్క్యూ మిషన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది పౌర రక్షణ సభ్యులు మరణించినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ చివర్లో ప్రారంభించిన ఇజ్రాయెల్ వరుస దాడుల్లో 1,400 మంది హెజ్బొల్లా సభ్యులు, పౌరులు మృతి చెందారు.
Similar News
News March 27, 2026
RCBvsSRH: కీలక ప్లేయర్ దూరం

IPL: SRHతో రేపు ఆరంభ మ్యాచ్ జరగనుండగా RCBకి మరో షాక్ తగిలింది. ఈ హైఓల్టేజ్ మ్యాచులో హేజిల్‌వుడ్ ఆడట్లేదని కోచ్ ఆండీ ఫ్లవర్ తెలిపారు. హీల్ ఇంజ్యూరీతో అతను గత OCT నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. నిన్న RCB క్యాంపులో చేరి ప్రాక్టీస్ చేస్తున్నా ఫిట్‌నెస్ సాధించలేదన్నారు. దీంతో RCB బౌలింగ్ భారం సీనియర్ బౌలర్ భువీపై పడనుంది. ఇప్పటికే నువాన్ తుషార, యశ్ దయాల్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
News March 27, 2026
పీరియడ్స్ ఆలస్యం.. ‘మార్చి’ని నిందిస్తున్న అమ్మాయిలు!

ఈ నెలలో తమ పీరియడ్స్ <<19484301>>ఆలస్యం<<>> అవుతున్నాయని, ‘మార్చి మంచిది కాదు’ అంటూ కొంతమంది అమ్మాయిలు SMలో పోస్టులు పెడుతున్నారు. కానీ అదంతా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. FEBలో 28 రోజులే ఉండటం, MARలో వాతావరణం, సూర్యరశ్మిలో మార్పు వంటి సైంటిఫిక్ రీజన్స్ హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. MARలోనే పరీక్షలు, రొటీన్ జాబ్ షిఫ్టుల స్ట్రెస్, ట్రావెల్ షెడ్యూల్సూ ఆలస్యానికి కారణమట.
News March 27, 2026
BREAKING: సీఎంలతో ప్రధాని వర్చువల్ మీటింగ్ స్టార్ట్

సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంపై దాని ప్రభావం, అనుసరించాల్సిన విధివిధానాలపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎస్‌లతో కేంద్రం విడిగా సమావేశం కానుంది. ఇక ఈ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.


