News December 22, 2025

ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఇస్రోకు<<>> చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, BA, BSc, BCom, డిప్లొమా అర్హతగల వారు JAN 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. గ్రాడ్యుయేట్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు, టెక్నీషియన్‌లకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.8వేలు చెల్లిస్తారు. www.iprc.gov.in

Similar News

News December 23, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్‌లో <>బుక్ చేసుకోండి<<>>.

News December 23, 2025

ఉద్యోగాలు లేక విదేశాలవైపు యువత చూపు!

image

విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ యువతే ఎక్కువగా ఉందని <<18646531>>నీతి ఆయోగ్<<>> స్పష్టం చేసింది. యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తోంది. 2025లో రాష్ట్రంలో నిరుద్యోగం 8 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు(5.2%) కంటే ఎక్కువ. నిరుద్యోగుల్లో ఎక్కువమంది డిగ్రీ చేసిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నా నాణ్యమైన ఇన్‌స్టిట్యూట్స్ లేవని యువత భావిస్తోంది.

News December 23, 2025

క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

image

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్స‌వ’ శుభాకాంక్షలు.