News March 15, 2025

అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

image

విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్(83), సింగపూర్(19) దేశాలకు చెందినవి ఉన్నాయి. మెుత్తంగా 393 విదేశీ ఉపగ్రహాలు, 3కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61దేశాలు, 5బహుళజాతి సంస్థలతో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది.

Similar News

News March 30, 2026

ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ.. ఎంతంటే?

image

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 95 క్రాస్ అయింది. ప్రస్తుతం ఒక $ విలువ ₹95.12గా ఉంది. సెన్సెక్స్ 1750 పాయింట్ల నష్టంతో 71,832 వద్ద, నిఫ్టీ 515 పాయింట్లు నష్టపోయి 22,304 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు కుప్పకూలాయి.

News March 30, 2026

బౌలింగ్ చేయని గ్రీన్.. స్పందించిన ఆస్ట్రేలియా

image

MIతో నిన్నటి మ్యాచ్‌లో KKR ఆల్‌రౌండర్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కెప్టెన్ <<19512235>>రహానే<<>> స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై CA అధికార ప్రతినిధి స్పందించారు. గ్రీన్ వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న కారణంతో కొన్ని రోజులు బౌలింగ్‌కు దూరంగా ఉంటారని చెప్పారు. 10-12రోజుల్లో తిరిగి బౌలింగ్ చేసే సామర్థ్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గాయం విషయం KKR యాజమాన్యానికి తెలుసన్నారు.