News August 15, 2024
ISRO: 55 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..!
భారత స్పేస్ రీసెర్చ్ సెంటర్(ఇస్రో)ను 1969 ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభమై 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1975లో ఆర్యభట్ట శాటిలైట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. 1983లో ఇన్శాట్, 2008లో చంద్రయాన్ 1, 2014లో మంగళయాన్, 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలు, 2023లో చంద్రయాన్ 3 ప్రయోగాలు చేపట్టి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. మరెన్నో భారీ ప్రాజెక్టులు చేపట్టాలని ఆశిద్దాం.
Similar News
News December 21, 2024
రేవంత్ను పిచ్చాసుపత్రిలో చూపించాలి: KTR
TG: CM రేవంత్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద KTR విమర్శించారు. ‘ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని కుటుంబీకులను కోరుతున్నా. ఎవరినో కరిచేలా ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రైతుబంధు లేదని, అరకొర రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. కాగా శాసనసభ నిరవధిక వాయిదా పడింది.
News December 21, 2024
జనవరి 2న క్యాబినెట్ భేటీ
AP: జనవరి 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు విషయాలపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం.
News December 21, 2024
RGV ‘వ్యూహం’ మూవీకి నోటీసులు
డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి AP ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో RGVతోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.