News January 16, 2025
ISRO మరో రికార్డ్: SpaDeX విజయవంతం!

ప్రతిష్ఠాత్మక SpaDeX ప్రయోగం విజయవంతమైనట్టు ISRO వర్గాలు తెలిపాయి. అంతరిక్షంలో 2 శాటిలైట్లను డాక్ చేసినట్టు వెల్లడించాయి. త్వరలోనే సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నాయి. DEC 30న PSLV C60 రాకెట్లో SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) శాటిలైట్లను ఇస్రో పంపింది. JAN 12న 3 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి పరిస్థితి అనుకూలంగా లేదని మళ్లీ సురక్షితమైన దూరానికి పంపింది. తాజాగా సక్సెస్ చేసింది.
Similar News
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.
News December 1, 2025
త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి దుర్గేశ్

సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా APని నిలుపుతామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ‘త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తాం. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహం కల్పిస్తాం. కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం. నంది అవార్డుల ప్రదానోత్సవం, నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహిస్తాం’ అని ముంబైలో ‘CII బిగ్ పిక్చర్ సమ్మిట్’లో వెల్లడించారు.


