News March 9, 2025
ఇస్రోకు త్వరలో రెండు కొత్త లాంచ్ ప్యాడ్లు

ISRO త్వరలో రెండు కొత్త లాంచ్ప్యాడ్లను ప్రారంభించనుందని ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఏపీలోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్టిణంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోపు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రయాన్-4ను 2028లో ప్రయోగిస్తామని, చంద్రునిపై నమూనాలను సేకరించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఉంటాయన్నారు.
Similar News
News December 3, 2025
వేములవాడ: రాజన్న ఆలయాభివృద్ధి.. ‘ఆఫీసర్లపై ఆంక్షలు’

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, ముఖ్యంగా ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఆయా అధికారులు అస్సలు నోరు విప్పడం లేదట. డెవలెప్మెంట్ పనులు, పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం మీడియాకు లీక్ చేయొద్దనే ఆంక్షలను ఆఫీసర్లపై విధించారట. దీంతో ఆలయాభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారమేదీ పక్కాగా బయటకు రావడంలేదు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏ చిన్న విషయమైన తెలుసుకోవాలని ప్రతి భక్తుడికి సాధారణంగా ఉంటుంది.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.
News December 3, 2025
జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్పై ట్యాక్స్!

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్పై అక్కడ వ్యాట్ లేదు.


