News May 20, 2024

నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయండి: ఐసీసీ ప్రాసిక్యూటర్

image

యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ICC) చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ కోరారు. హమాస్‌తో యుద్ధంలో పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారని ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నెతన్యాహుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపే అవకాశముంది.

Similar News

News December 14, 2025

యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కు ఇలా చెక్

image

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్‌కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్‌ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth

News December 14, 2025

వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

News December 14, 2025

పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

image

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.